Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label hrudhaya kaleyam hero beaten by public in bar. Show all posts
Showing posts with label hrudhaya kaleyam hero beaten by public in bar. Show all posts

Sunday, April 6, 2014

hrudhaya kaleyam hero beaten by public in bar

హృదయ కాలేయం’ హీరోపై దాడి




హైదరాబాద్ (ఇఎన్ఎస్): ఇటీవలే విడుదలైన సినిమా ‘‘హృదయ కాలేయం’ కథా నాయకుడు, డైరెక్టర్లపై దాడి జరిగిన ఘటన శనివారం రాత్రి మాదాపూర్ వద్ద ఓ హోటల్‌లో చోటు చేసుకుంది. వారాంతపు వేడుకల్లో పాల్గొనేందుకు హైటెక్‌సిటీ సమీపంలోని వెస్టిన్‌హోటల్ బార్‌కెళ్లిన ‘హృదయ కాలేయం’ కథా నాయకుడు సంపూర్ణేష్ బాబు, డైరెక్టర్ స్టీవెన్ శంకర్‌లపై హోటల్ టాయిలెట్ రూమ్‌ల్లో కొందరు ఆగంతకులు దాడికి పాల్పడ్డారు.
ఈ విషయం తెలిసిన వెంటనే హోటల్ యాజమాన్యం, పోలీసులకు సమాచారం ఇచ్చింది. మాదాపూర్ డిసిపి కాంతి రాణా తాతా ఆధ్వర్యంలో హోటల్‌కు చేరుకుని నిందితుడ్ని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. హోటల్‌కు వచ్చిన యువకులు మద్యం సేవించిన మత్తులో డైరెక్టర్ స్టీవెన్ శంకర్ టేబుల్ వద్ద చేరి గలాబా సృష్టించారు. యువకులు సంపూర్ణేష్‌బాబు, డైరెక్టర్ స్టీవెన్ శంకర్‌లతో వాగ్వాదానికి దిగారు.
ఐదు నిముషాల తర్వాత స్టీవెన్ శంకర్ టాయిలెట్‌కు వెళ్లిన విషయం గమనించిన యువకుడు కూడా అక్కడికి వెళ్లాడు. వారిమధ్య వాగ్వాదం జరగడంతో రంజిత్ అనే యువకుడు డైరెక్టర్ స్టీవెన్ శంకర్‌పై దాడి చేయడంతో గాయంతో కింద పడిపోయాడని డిసిపి కాంతి రాణా తాతా తెలిపారు. డైరెక్టర్ స్టీవెన్ శంకర్ పరిస్థితి స్థిరంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
చిత్రంలో సంపూర్ణేష్ బాబు పాత్ర సరిగ్గా లేదని, దారుణంగా ఉందని ఆగంతకులు వాగ్వాదానికి దిగారు. స్టీవెన్ శంకర్‌పై దాడిని అడ్డుకోబోయిన సంపూర్ణేష్ బాబుపై కూడా దాడి చేశారని డిసిపి కాంతి రాణా తాతా తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు నిందితులపై ఐపిసి 324, 506 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపారు. స్టీవెన్ శంకర్ దర్శకత్వంలో సంపూర్ణేష్ బాబు నటించిన ‘హృదయ కాలేయం’ చిత్రం ఈనెల 4న విడుదలైంది. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలం సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
                                        


Read more...

About This Blog

entertain here

Lorem Ipsum

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP